25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

Writer: Shivani K 09:45 PM, 25 సెప్టెంబర్, 2026
ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఘన నివాళులర్పించారు. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమె స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం బీసీలు, పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటానికి జంగ్ సైరన్ మోగించారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని సీఎం తెలిపారు. కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమె సేవలను స్మరించుకున్నామని చెప్పారు. ఐలమ్మతో పాటు తెలంగాణ వీర మహిళలు ప్రదర్శించిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు కూడా ఆదర్శమని అన్నారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య, గురుకులాలు, హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు యువత, మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు, గౌరవం, న్యాయం అందించడమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని సీఎం స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం
ట్యాగ్లు
చాకలి ఐలమ్మరేవంత్‌ రెడ్డితెలంగాణ ప్రభుత్వంసామాజిక న్యాయంతెలంగాణ సాయుధ పోరాటంబీసీలుమహిళా సాధికారతవెనుకబడిన వర్గాలుసమానత్వంతెలంగాణ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
జనరల్

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ
జనరల్

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర
సినిమాలు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?
సినిమాలు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన
సినిమాలు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
జనరల్

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
రాజకీయాలు