
రాజకీయాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడతలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున జమ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.34 కోట్ల మంది రైతులకు రూ.18,680 కోట్ల ఆర్థిక సాయాన్ని బదిలీ చేసినట్లు సమాచారం. ఈ నిధులు రైతు కుటుంబాలకు వ్యవసాయ అవసరాల కోసం ఆర్థికంగా తోడ్పడనున్నాయి.
ఇదిలా ఉండగా, సిద్దిపేటలోని పొన్నాల రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు వ్యవసాయశాఖ అధికారులతో కలిసి వీక్షించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం అందుతోంది. నిధుల విడుదల కార్యక్రమాన్ని రైతులు, అధికారులు వీక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!