30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..

Writer: Chandrika 12:15 PM, 30 అక్టోబర్, 2026
గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..

మహాత్మా గాంధీ మనవడు దివంగత కనూ గాంధీ కుటుంబానికి చెందిన అమెరికాలోని 30 ఎకరాల భూమి వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. దాదాపు 20 నెలల పాటు సాగిన న్యాయపోరాటం అనంతరం గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. వర్జీనియాలోని వారెన్ కౌంటీలో షెనాండో నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న ఈ భూమిని కనూ గాంధీ, ఆయన భార్య శివా గాంధీ 1987లో కొనుగోలు చేశారు. 2016లో కనూ గాంధీ మరణించగా, 2018లో శివా గాంధీ ఆయన పేరుతో పాటు తన పేరుపై చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రచారం కోసం తమ ఆస్తులను దానికి బదిలీ చేశారు.

ఈ వివాదం 2025 జనవరిలో ప్రారంభమైంది. వర్జీనియాకు చెందిన గ్రెగరీ బ్లాక్ అనే వ్యక్తి, అక్కడి అడ్వర్స్ పొసెషన్ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ఆ భూమిపై తనకు హక్కు ఉందని వాదించాడు. ఈ చట్టం ప్రకారం నిర్దిష్ట నిబంధనలతో 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఒక భూమిని స్వాధీనంలో ఉంచుకున్న వ్యక్తి యాజమాన్య హక్కును కోరవచ్చు. అయితే ట్రస్ట్ ప్రతినిధి పరిమళ్ దేశాయ్ న్యాయవాదుల సహకారంతో పాటు GIS మ్యాపులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి ఆ వాదనను సవాలు చేశారు. సదరు వ్యక్తి నిర్మించానని చెప్పిన కేబిన్ 15 ఏళ్లుగా అక్కడ లేదని ఆధారాలతో నిరూపించినట్లు సమాచారం. వాదనలు పరిశీలించిన కోర్టు అతడి క్లెయిమ్‌ను తోసిపుచ్చి, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించింది. దీంతో 30 ఎకరాల భూమిపై ట్రస్ట్‌కు హక్కు దక్కింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత నౌకాదళానికి రూ.40 వేల కోట్లతో 8 అత్యాధునిక యుద్ధనౌకలు..

భారత నౌకాదళానికి రూ.40 వేల కోట్లతో 8 అత్యాధునిక యుద్ధనౌకలు..

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..

ఏపీలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్.. ఎన్నికల వేళ కీలక ఆంక్షలు

ఏపీలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్.. ఎన్నికల వేళ కీలక ఆంక్షలు

జలంధర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్

జలంధర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్

9 గిన్నిస్ రికార్డులతో భారత కుర్రాడి సంచలనం..
ట్యాగ్లు
గాంధీ చారిటబుల్ ట్రస్ట్కనూ గాంధీమహాత్మా గాంధీఅమెరికా కోర్టువర్జీనియా భూవివాదంఅడ్వర్స్ పొసెషన్ చట్టంజీఐఎస్ మ్యాపులుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పరిమళ్ దేశాయ్గాంధేయ సిద్ధాంతాలు

9 గిన్నిస్ రికార్డులతో భారత కుర్రాడి సంచలనం..

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..
రాజకీయాలు

దీపావళి వేళ కాంగ్రెస్‌ ర్యాలీపై అభ్యంతరం..

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..
రాజకీయాలు

ఐడీబీఐ విక్రయ నిర్ణయంపై రాహుల్ అభ్యంతరం..

భారత నౌకాదళానికి రూ.40 వేల కోట్లతో 8 అత్యాధునిక యుద్ధనౌకలు..
జనరల్

భారత నౌకాదళానికి రూ.40 వేల కోట్లతో 8 అత్యాధునిక యుద్ధనౌకలు..

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..
జనరల్

పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల..

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్
బిజినెస్

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్

బిగ్‌బాస్ 10: కష్టపడ్డా అమన్‌కు దక్కని కెప్టెన్సీ అవకాశం.. హౌస్‌మేట్స్ మద్దతు కరువైందా?
షోస్

బిగ్‌బాస్ 10: కష్టపడ్డా అమన్‌కు దక్కని కెప్టెన్సీ అవకాశం.. హౌస్‌మేట్స్ మద్దతు కరువైందా?

ఏపీలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్.. ఎన్నికల వేళ కీలక ఆంక్షలు
జనరల్

ఏపీలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్.. ఎన్నికల వేళ కీలక ఆంక్షలు

జలంధర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్
జనరల్

జలంధర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఈమెయిల్

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్
రాజకీయాలు

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

 ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు
బిజినెస్

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..
జనరల్

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్
రాజకీయాలు

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!