

కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని పంట పొలాల్లో ఉన్న పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఓఎన్జీసీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు చర్యలు చేపట్టారు. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెల 26న కూడా ఇదే ప్రాంతంలో గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో మరోసారి లీకేజీ సంభవించడం ప్రజల్లో భయాందోళనలను పెంచింది. ప్రస్తుత లీకేజీని త్వరితగతిన అదుపు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. తరచూ గ్యాస్ లీకేజీలు జరగకుండా పైప్‌లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!