
గాసిప్స్

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడి యత్నం జరిగినట్లు సమాచారం. ఇద్దరు యువకులు ఆయన కార్యాలయంలోకి దూసుకువచ్చారని, అయితే అక్కడ ఉన్న సిబ్బంది వారిని అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని తెలుస్తోంది.
ఈ ఘటన అనంతరం ఎమ్మెల్యే బాలరాజు స్పందిస్తూ, కొంతకాలంగా తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఈ దాడి వెనుక కూడా ప్రతిపక్షాల పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!