
జనరల్

టీడీపీ సీనియర్ నాయకుడు బొండా ఉమామహేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే వైసీపీ నేత అంబటి రాంబాబు పాల్గొన్న కార్యక్రమానికి బొండా ఉమా హాజరుకావడంపై వివరణ ఇవ్వాలని పార్టీ కోరింది.
అంబటి రాంబాబుతో ఒకే వేదికను పంచుకోవడం ద్వారా కూటమి ధర్మాన్ని పాటించలేదని టీడీపీ-జనసేన శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై బొండా ఉమా ఇచ్చే వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!