

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పరిపాలనా వైఫల్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై శివరాంపల్లి నుంచి అరంఘర్ అండర్‌పాస్ వరకు ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు కుప్పలుగా కనిపించాయి. ఇవి 2018లో నిర్వహించిన వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు అని గుర్తించారు. అభ్యర్థుల పేర్లు, హాల్‌టికెట్ నంబర్లు, పేపర్ కోడ్‌లు, ఇన్విజిలేటర్ల సంతకాలు ఉండటంతో వాహనదారులు వాటిని సేకరించి ఫొటోలు తీసి అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఓఎంఆర్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం పరీక్షల అనంతరం ఓఎంఆర్ షీట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి రీసైక్లింగ్‌కు పంపాలి. అయితే ఆ ప్రక్రియను పాటించకుండా నేరుగా విజయవాడకు తరలిస్తుండగా అవి రోడ్డుపై పడిపోయినట్లు సమాచారం. గోప్యంగా ఉండాల్సిన పరీక్ష పత్రాలు ఇలా బహిరంగంగా కనిపించడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సంబంధిత ఎస్పీని టీజీపీఎస్సీ ఆదేశించగా, నిర్లక్ష్యానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!