
క్రీడలు

ఔషధాల విక్రయాల నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా కఫ్ సిరప్‌లు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ చూపించాల్సి ఉంటుంది. ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టడం, బాధ్యతాయుత వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా 1945 ఔషధ మరియు సౌందర్య సాధనాల నిబంధనల్లో మార్పులు చేసింది.
ఈ మార్పుల్లో భాగంగా కఫ్ సిరప్‌లను షెడ్యూల్ ‘కె’ నుంచి తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కొత్త నిబంధనలతో ఔషధాల విక్రయాలపై మరింత పర్యవేక్షణ పెరిగి, ప్రజారోగ్య భద్రతకు తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!