

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. అక్టోబర్ 12, 2026న రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, డాక్టర్ సుధా యాదవ్ కర్ణాటక గవర్నర్‌గా, బ్రజ్ మోహన్ రామ్ ఒడిశా గవర్నర్‌గా, డాక్టర్ ధాల్ సింగ్ బిసేన్ ఉత్తరాఖండ్ గవర్నర్‌గా, దుష్యంత్ గౌతమ్ సిక్కిం గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకాలు దేశవ్యాప్తంగా గవర్నర్ల స్థాయిలో జరిగిన కీలక మార్పుల్లో భాగంగా ఉన్నాయి.
ఇదే సమయంలో ఇద్దరు ప్రస్తుత గవర్నర్ల బాధ్యతల్లోనూ మార్పులు జరిగాయి. ఇప్పటివరకు సిక్కిం గవర్నర్‌గా ఉన్న ఓం ప్రకాశ్ మాథుర్‌ను కేరళం గవర్నర్‌గా నియమించారు. కేరళం గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు. కొత్తగా నియమితులైన గవర్నర్లు తమ తమ పదవుల బాధ్యతలు స్వీకరించే తేదీ నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!