

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భార్య గురుప్రీత్ కౌర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. రేప్ కేసును తొక్కిపెట్టేందుకు గురుప్రీత్ కౌర్ రూ.5 కోట్లు లంచంగా డిమాండ్ చేశారని పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు ఆరోపించారు.
ఈ ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తు చేపట్టి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ గురుప్రీత్ కౌర్ మాజీ న్యాయమూర్తికి లీగల్ నోటీసు పంపించారు. 24 గంటల్లోగా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆమె నోటీసులో కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల నుంచి కూడా స్పందనలు వచ్చాయి. ఆరోపణల తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!