24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

Writer: Harika S 06:44 AM, 24 ఆగస్టు, 2026
ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

పాన్‌ ఇండియా స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్‌ చిత్రం ‘టాక్సిక్‌’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తన సినీ ప్రయాణంతో పాటు యశ్‌తో తన అనుబంధం, సినిమాపై వచ్చిన విమర్శల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనపై ఎవరూ నమ్మకం పెట్టుకోని సమయంలో యశ్ మాత్రం తనను పూర్తిగా నమ్మాడని ఆమె తెలిపారు.

బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన గీతూ.. ఆ తర్వాత నటిగా, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లయర్స్‌ డైస్‌’ రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడంతో పాటు 87వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో భారత్‌ తరఫున అధికారిక ఎంట్రీగా నిలిచింది. అనంతరం తెరకెక్కించిన ‘మూతూన్‌’ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. తనకు ఇన్ని అవార్డులు వస్తాయని దర్శకురాలిగా మారినప్పుడు ఊహించలేదని గీతూ తెలిపారు.

కేరళలో జన్మించిన గీతూ మోహన్‌దాస్‌ అసలు పేరు గాయత్రీ దాస్‌. మలేషియా, కెనడాలో పెరిగిన ఆమె ఐదేళ్ల వయసులో మోహన్‌లాల్‌ నటించిన ‘ఒన్ను ముతల్‌ పూజ్యం వారే’ చిత్రంతో బాలనటిగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ చిత్రానికి ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్నారు. అనంతరం తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె 2009లో నటనకు విరామం ఇచ్చి దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఆమె రూపొందించిన లఘుచిత్రం అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రోటర్‌డామ్‌లో ప్రదర్శితమై పలు అవార్డులు సాధించింది. అంతేకాదు, ఆ లఘుచిత్రాన్ని కేరళలో 12వ తరగతి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చారు.

సినిమాటోగ్రాఫర్‌ రాజీవ్‌ రవితో పరిచయం కూడా తన సినీ ప్రయాణంలో కీలకంగా మారిందని గీతూ చెప్పారు. కలిసి పనిచేసే సమయంలో ఏర్పడిన స్నేహం 12 ఏళ్ల తర్వాత వివాహ బంధంగా మారింది. 2009లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి ఆరాధన అనే కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు కొంతకాలం విరామం తీసుకున్న సమయంలో భర్త రాజీవ్‌ రవి నుంచి దర్శకత్వానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గీతూ తెలిపారు.

‘టాక్సిక్‌’లో యశ్‌ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ విడుదలైన సమయంలో తనపై తీవ్ర విమర్శలు వచ్చాయని గీతూ వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలోని ఇంటిమేట్‌ సన్నివేశాలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారని చెప్పారు. మహిళా దర్శకురాలు కావడం వల్లే తనపై ఆ విమర్శలు మరింతగా వచ్చాయని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మహిళల స్వేచ్ఛ, సమ్మతి, ఆనందం వంటి అంశాలపై సమాజంలో ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

యశ్ తనకు కేవలం స్టార్‌, నిర్మాత, నటుడు, సహ రచయిత మాత్రమే కాదని.. ఒక డీప్‌ ఎమోషన్‌ అని గీతూ మోహన్‌దాస్‌ పేర్కొన్నారు. ‘టాక్సిక్‌’ వంటి భారీ చిత్రాన్ని తాను పూర్తి చేయలేనని చాలామంది యశ్‌తో చెప్పినప్పటికీ, ఆయన మాత్రం తన ప్రతిభపై నమ్మకం ఉంచారని తెలిపారు. నాలుగేళ్లకు పైగా తనతో కలిసి ప్రయాణిస్తూ సినిమా పూర్తయ్యే వరకు అండగా నిలిచిన యశ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని గీతూ చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!

‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

ట్యాగ్లు
గీతూ మోహన్‌దాస్‌యశ్‌టాక్సిక్‌టాక్సిక్‌ మూవీపాన్‌ ఇండియా సినిమాభారతీయ సినిమాకన్నడ సినిమాసినీ దర్శకురాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా? యువతకు భారతీయ దంపతుల కీలక సూచన
జనరల్

అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా? యువతకు భారతీయ దంపతుల కీలక సూచన

ట్రంప్ నిర్ణయంతో అమెరికా-కెనడా వాణిజ్య బంధానికి షాక్
జనరల్

ట్రంప్ నిర్ణయంతో అమెరికా-కెనడా వాణిజ్య బంధానికి షాక్

జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!
జనరల్

జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?
జనరల్

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్
జనరల్

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్
సినిమాలు

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి
జనరల్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు
జనరల్

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!
జనరల్

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
జనరల్

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..
జనరల్

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...
జనరల్

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!