
జనరల్

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా పఖి కలాన్ గ్రామ రైతులు చేసిన ఓ వినూత్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, గుర్తుతెలియని దొంగలకు వారు సరదాగా కానీ ఆవేదనతో కూడిన విజ్ఞప్తి చేశారు – నీటి మోటార్లను దొంగిలించవద్దని కోరారు.
రైతుల పొలాల నుంచి రెండు నెలల క్రితం 15 నీటి మోటార్లు చోరీకి గురయ్యాయి. ఆ తర్వాత ఒకే రాత్రి పొలాల్లో ఉంచిన 25 ద్విచక్ర వాహనాలు కూడా దొంగలపాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో విసిగిపోయిన రైతులు, దొంగలే బ్యాంకు ఖాతా తెరిచి వివరాలు ఇవ్వాలని, తాము పంట రక్షణ నిధిగా డబ్బులు పంపిస్తామని సరదాగా విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!