
జనరల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్ తిరస్కరించింది. బ్రిటన్‌లో ఓ కంపెనీ ఏర్పాటు చేసిన సమయంలో రాహుల్ గాంధీ తనను తాను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన భారత పౌరసత్వాన్ని, ఎంపీ పదవిని రద్దు చేయాలని కోర్టును కోరారు.
అయితే ఈ ఆరోపణలకు మద్దతుగా తగిన ఆధారాలను పిటిషనర్ సమర్పించలేకపోయారని కోర్టు పేర్కొంది. దీంతో పిటిషన్‌ను తిరస్కరించింది. ఇదే అంశానికి సంబంధించిన ఆరోపణలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోర్టు తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!