

రాయదుర్గంలోని భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ-వేలంలో ప్లాట్ నంబర్ పీ1కు ఎకరాకు ఏకంగా రూ.264 కోట్ల ధర పలికింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ నిర్వహించిన భూముల వేలంలో ఇదే అత్యధిక ధరగా నిలిచింది. మొత్తం 5.25 ఎకరాల భూమి విక్రయం ద్వారా టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు రూ.175 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించగా, పోటాపోటీగా సాగిన వేలంలో అది 51 శాతం పెరిగి రూ.264 కోట్లకు చేరింది.
రాయదుర్గంలో గత మేలో జరిగిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్ల రికార్డు నమోదైంది. కేవలం మూడు నెలల్లోనే ఆ రికార్డును అధిగమించి తాజా వేలంలో రూ.264 కోట్ల ధర రావడం హైదరాబాద్‌పై పెట్టుబడిదారుల ఆసక్తిని స్పష్టం చేస్తోందని అధికారులు తెలిపారు. ఎంఎస్‌టీసీ ఈ-ఆక్షన్ వేదిక ద్వారా పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలంలో జాతీయ స్థాయి ప్రముఖ డెవలపర్లు పాల్గొన్నారు. జేఎల్‌ఎల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించింది. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి వ్యాపార, పెట్టుబడి కేంద్రంగా వేగంగా ఎదుగుతున్నదానికి ఈ ఫలితం నిదర్శనమని టీజీఐఐసీ పేర్కొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!