
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలో సీఎం తన ప్రతినిధి బృందంతో కలిసి పర్యటించారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ పరిధిలోని బ్లావాట్‌నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శించారు. అక్కడ ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీ తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు అంశాలతో పాటు పాలన, విద్య, ప్రజా విధానాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు పలువురు అధికారులు, ప్రతినిధులు ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి భారతదేశంతో ప్రత్యేక అనుబంధం ఉంది. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఈ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!