
జనరల్

తెలంగాణకు సంబంధించిన కీలక అభివృద్ధి, నిధుల అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సహాయం, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నిధులు అందేలా కేంద్రం చొరవ చూపాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కోరగా, కిషన్ రెడ్డి అశ్విని వైష్ణవ్‌తో భేటీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తెలంగాణకు కీలకంగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!