

బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్, రీతూ చౌదరి జంటగా నటించిన ‘బంగారం’ ఆల్బమ్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మెలోడీ, ఆకట్టుకునే విజువల్స్, ఇద్దరి సహజమైన కెమిస్ట్రీతో ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అఫ్రోజ్ అలీ రచన, స్వరపరిచిన ఈ పాటను ఆయనతో పాటు సమీరా భరద్వాజ్ ఆలపించగా, రంజిత్ రెడ్డి అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటకు వస్తున్న ఆదరణపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.
సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డెమాన్ పవన్ మాట్లాడుతూ, బిగ్‌బాస్ ద్వారా వచ్చిన ప్రేమతోనే ఈ పాటను నిర్మించానని తెలిపారు. భవిష్యత్తులో డీపీ క్రియేషన్స్ బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు, సినిమాలు, భారీ చిత్రాలను నిర్మించే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించారు. రీతూ చౌదరి కూడా ఈ పాటకు లభిస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమీరా భరద్వాజ్, అఫ్రోజ్ అలీ, రంజిత్ రెడ్డి, విజ్జు ముధిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!