
రాజకీయాలు

విశాఖపట్నంలో తన అకాడమీ కోసం మరోసారి భూమిపూజ నిర్వహించడంపై వస్తున్న విమర్శలకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివరణ ఇచ్చారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం ఏడు గంటల ముందస్తు సమాచారంతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారని, దీంతో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, తన ప్రయాణంలో అండగా నిలిచిన పలువురు కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో అకాడమీని కేవలం క్రీడా కేంద్రంగా కాకుండా క్రీడా-విద్యా సంస్థగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పీవీ సింధు వెల్లడించారు. అందుకే ప్రాజెక్టును పునఃప్రారంభించే సమయంలో తనకు ముఖ్యమైన వ్యక్తుల సమక్షంలో మరోసారి భూమిపూజ నిర్వహించాలని భావించామని, అదే కారణంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!