

కర్ణాటకలోని మునీరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగభద్ర జలాల సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం మాత్రమే కాకుండా, మూడు తరాలుగా కొనసాగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగని ఆయన పేర్కొన్నారు. లక్షలాది మంది రైతుల సమస్యలను పరిష్కరించే అవకాశమున్న ఈ కార్యక్రమం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజోలిబండ డైవర్షన్ స్కీం (RDS) కింద తెలంగాణకు కేటాయించిన 17.9 టీఎంసీల నీటిలో కేవలం 5 నుంచి 6 టీఎంసీలే వినియోగించగలుగుతున్నామని, మిగిలిన నీటి వాటా రైతులకు అందడం లేదని సీఎం తెలిపారు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీటి కేటాయింపుల సమస్యలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ చర్చలు అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతాయని, రైతుల ప్రయోజనాల కోసం అన్ని రాష్ట్రాలు కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!