
బిజినెస్

నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో రేపు వరుణ యాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం.. 2.45 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి యాగం జరిగే ప్రాంతానికి వెళ్తారు.
108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో ఈ వరుణ యాగం జరగనుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో యాగం చేపడుతున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!