

భారతీయ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటిగా నిలుస్తోంది. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఎపిక్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా 50 వేలకుపైగా స్క్రీన్లలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇటీవల విడుదలైన ‘ఒడిస్సీ’ సినిమా 25 వేలకుపైగా స్క్రీన్లలో విడుదలైన నేపథ్యంలో ‘రామాయణ’ రిలీజ్‌పై వినిపిస్తున్న సంఖ్య మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో సోనీ పిక్చర్స్ ఆధ్వర్యంలో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 50 వేలకుపైగా స్క్రీన్లలో విడుదలవుతుందనే వార్త నిజమై, ప్రేక్షకుల నుంచి కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తే ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!