
బిజినెస్

స్కూల్లు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బస్సుల భద్రత, ఫిట్‌నెస్ మరియు చట్టబద్ధ పత్రాలపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఆరు స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు.
బస్సులకు సంబంధించిన ఆర్సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లు, డ్రైవర్ల లైసెన్సులను అధికారులు పరిశీలించారు. అలాగే విద్యార్థుల భద్రత దృష్ట్యా బస్సుల్లో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్, విద్యార్థుల జాబితా, సీసీ కెమెరాలు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనే అంశాలను తనిఖీ చేశారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారా అనే కోణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!