
జనరల్

వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో తెలంగాణలో పాఠశాల, కళాశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. లంగర్ హౌస్ టిప్పుఖాన్ పూల్ వద్ద రంగారెడ్డి రవాణా శాఖ బృందాలు బస్సుల ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు, అగ్నిమాపక భద్రతా పరికరాలు, ప్రథమ చికిత్స పెట్టెలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాయి.
వాహన తనిఖీ అధికారులు డ్రైవర్ల అనుమతి పత్రాలను కూడా పరిశీలించారు. 60 సంవత్సరాలు దాటిన డ్రైవర్లతో విద్యార్థుల బస్సులు నడపవద్దని విద్యాసంస్థలకు సూచించారు. మూడు బృందాలు కలిసి సుమారు 60 బస్సులను తనిఖీ చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన 6 బస్సులపై జరిమానాలు విధించారు. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యమని, మరో వారం రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!