

తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (DoNER) కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ జాజును తెలంగాణకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్ కలెక్టర్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న ఆయన పేరును, జయేశ్ రంజన్‌తో పాటు పరిశీలించినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంజయ్ జాజు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అధికారిక నియామక ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!