
సినిమాలు

హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రధాన కార్యదర్శితో ఎస్బీఐ ప్రతినిధులు, మెట్రోరైల్ అధికారులు సమావేశమయ్యారు. రాయదుర్గంలో ఉన్న 5 ఎకరాల భూమి, మెట్రో మొదటి దశ ఆస్తుల విలువ అంచనాపై ఈ సమావేశంలో చర్చించారు. మెట్రో తొలి దశ ఆస్తుల విలువను అంచనా వేయడానికి అవసరమైన చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు.
రాయదుర్గంలోని 5 ఎకరాల భూమి వివాదంపై ఎస్‌బీఐ సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నుంచి ఉపసంహరించుకుంటామని ఎస్‌బీఐ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శికి తెలిపారు. దీనికి ప్రతిగా ఎస్‌బీఐకి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!