
జనరల్

వెనెజువెలాలో వరుసగా రెండు భూకంపాలు సంభవించి దేశాన్ని వణికించాయి. రాజధానిలో భారీ విధ్వంసం చోటుచేసుకుని, పలు బహుళ అంతస్తు భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉండగా, మరణాల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చని హెచ్చరికలు వెలువడ్డాయి.
ప్రస్తుతం మృతుల సంఖ్యపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావాలని అధికారులు సూచించారు. సుమారు 20 ప్రకంపనల తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానాశ్రయాలు, పాఠశాలలు మూసివేయడంతో పాటు రవాణా సేవలు నిలిపివేయబడ్డాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!