
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు చెల్లవని న్యాయస్థానం పేర్కొన్నట్లు సమాచారం. బస్సు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఇదే విధంగా ఉద్యోగాలు ఇస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రభుత్వ ఉద్యోగాలను ఇష్టానుసారంగా పంచిపెట్టే అవకాశం లేదని, ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యలపై నియంత్రణ లేకపోతే ఏకపక్ష నిర్ణయాలకు దారితీసి అరాచకం, అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిర్దేశిత నిబంధనలు, రాజ్యాంగ సూత్రాలను పాటించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!