
జనరల్

2013 గోవా అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గోవా బెంచ్ ఆయనను దోషిగా తేల్చుతూ, గతంలో సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును రద్దు చేసింది. గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు సమర్థించింది.
సహోద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో హైకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ కేసులో వచ్చిన తాజా పరిణామం న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!