
జనరల్

అయోధ్య రామాలయ నిర్వహణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్, ప్రధాని మోదీ మాజీ ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్ర సూచించారు. ఆలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు పర్యవేక్షణ, జవాబుదారీతనం, విధానాల అమలులో తీవ్రమైన లోపాలను బయటపెట్టాయని ఆయన అన్నారు.
సుమారు 1500 మంది ఆలయ విధుల్లో ఉన్నప్పటికీ సరైన నిర్వహణ వ్యవస్థ లేదని పేర్కొన్నారు. మరోవైపు కోట్ల రూపాయల విరాళాల అవకతవకలపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!