
జనరల్

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. పేదలకు పారదర్శకంగా, సులభంగా రేషన్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతోంది.
ఈ పంపిణీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పంపిణీ ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!