

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే ప్రతిపక్షాల కుట్రలను ప్రజలే అడ్డుకుంటారని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలు ప్రజల మద్దతుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన యూనిట్ ఇన్‌ఛార్జిల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
డీఎస్సీ పరీక్షలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరికీ పార్టీనే ప్రథమమని, నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలను తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించినా, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసినా సహించబోమని ‘జీరో టాలరెన్స్’ హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తు ఎన్నికల్లో ప్రతి బూత్‌లో గత కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా శ్రమించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!