
సినిమాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు మైఖెల్ బౌలోస్ శనివారం వ్యక్తిగత పర్యటనలో భాగంగా కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఆయన వెంట ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మైఖెల్ బౌలోస్ అలప్పుళలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మైఖెల్ బౌలోస్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమయ్యారనే వార్తలు వచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి కార్యాలయం వాటిని ఖండించింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో మాత్రమే సీఎం చర్చలు జరిపారని, ఆ సమావేశంలో బౌలోస్ పాల్గొనలేదని స్పష్టం చేసింది. బౌలోస్, గోర్ దశాబ్దకాలంగా స్నేహితులని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఏడాది మేలో బౌలోస్ తన భార్య, ట్రంప్ కుమార్తె టిఫానీతో కలిసి భారత్‌లో పర్యటించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!