
సినిమాలు

విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కానిస్టేబుళ్లు అశోక్, నానీలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే హెడ్ కానిస్టేబుళ్లు సాంబయ్య, బాబూరావులను కూడా విచారణ కోసం కస్టడీలోకి తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై వారిని ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించిన సిట్‌కు ఆయన తనకు కేసు వివరాలపై సమాచారం లేదని, కానిస్టేబుళ్లకే పూర్తి విషయం తెలుసని చెప్పినట్లు తెలిసింది. నాగరాజు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కానిస్టేబుళ్లను విచారించనున్న అధికారులు, సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసే ప్రక్రియలో నలుగురు కానిస్టేబుళ్లు కీలక పాత్ర పోషించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!