

ఆహారం, ఔషధాల్లో పెరుగుతున్న కల్తీని అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలు మరియు ఇతర ఆహార పదార్థాల్లో రసాయనాల వినియోగం అధికమవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్‌డీ)లో సమీక్ష నిర్వహిస్తూ, పంటల్లో ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగం వల్ల రసాయన అవశేషాలు పెరిగి విదేశీ దిగుమతులకు కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
సేంద్రియ ఉత్పత్తుల పేరుతో మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్నప్పటికీ, వాటి నిజమైన ప్రమాణాలను నిర్ధారించే వ్యవస్థలు లేవని సీఎం పేర్కొన్నారు. కల్తీ నియంత్రణలో విజయవంతమైన దేశాల విధానాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి సమాచారం సేకరించాలని, క్యూర్ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని లోపాలను గుర్తించి ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!