

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రముఖ నటుడు మమ్ముట్టి నాలుగోసారి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఆనందదాయకమని అన్నారు. అలాగే కార్తీక్ ఆర్యన్, ఉత్తమ నటి యామీ గౌతమ్‌లకు కూడా అభినందనలు తెలిపారు.
తెలుగు సినిమా పలు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. ‘కల్కి 2898 ఎ.డి.’ ఉత్తమ పాపులర్ చిత్రంగా నిలవగా, ‘35 - చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రంగా, అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడిగా ఎంపికయ్యారు. ‘పుష్ప 2’కి సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే, ‘లక్కీ భాస్కర్’కి వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణల రచయితగా గుర్తింపు పొందారు. నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, దర్శకుడు యదు వంశీ, మేకప్ ఆర్టిస్ట్ పి. రవి కుమార్ సహా మొత్తం బృందాన్ని అభినందించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!