

ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితాలపై తెరకెక్కిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి చిత్రం ‘ఎల్‌జీబీటీ – ఏ లీగల్ బ్యాటిల్’ ఈ నెల 19న దేశవ్యాప్తంగా విడుదలై మంచి స్పందనను అందుకుంది. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్‌పై సుభాష్ చక్రవర్తి సహ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం సామాజిక అంశాలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం ఛాంబర్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాన్ని నిర్వహించి చిత్రబృందాన్ని సత్కరించింది. ఈ వేడుకలో ఎల్.బి. శ్రీరామ్ మాట్లాడుతూ, ఇలాంటి ప్రతిభావంతుడైన దర్శకుడిని పరిశ్రమ ఇప్పటివరకు గుర్తించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రేక్షకులు, విమర్శకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. 2027లో ఈ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. హీరోయిన్ సనాఖాన్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్ సమస్యలను సమాజంలోకి తీసుకురావడంలో ఇలాంటి చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఎల్.బి. శ్రీరామ్ కూడా ఈ చిత్రం ద్వారా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ జీవన విధానంపై లోతైన అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఈ చిత్రం మరింత సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!