

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృత్యువుతో పోరాడి ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొంటూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన ప్రమాదం కాదని, నిందితుడి క్రూర చర్యగా ఆమె అభివర్ణించారు. కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారంటూ ప్రభుత్వ తీరుపై ఆమె విమర్శలు చేశారు.
ప్రియాంక కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, త్వరితగతిన విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మహిళలపై పెరుగుతున్న దాడులను ప్రధాన అజెండాగా తీసుకుని చర్చించాలని కోరారు. రాష్ట్రంలో మహిళల భద్రతను పెంచేందుకు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!