

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగ సంస్థలను అవమానించడం, ప్రజాస్వామ్యాన్ని కించపరచడం, ప్రభుత్వ విదేశాంగ విధానం, దౌత్య సంబంధాలపై విమర్శలు చేయడం, ప్రధాని వ్యక్తిగత సంబంధాల గురించి అనుచితంగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్లా అని ప్రశ్నించారు.
వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాల నేపథ్యంలోనే రాహుల్‌గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఎన్నికల సంఘం, ఎన్నికల నిర్వహణపై రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. రాహుల్ గాంధీ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించగా, బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను విమర్శించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!