
సినిమాలు

మహాగణపతి ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్, పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించనున్నారు.
మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలను అవసరాన్ని బట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు సెప్టెంబర్ 24 వరకు కొనసాగనున్నాయి. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులు సూచించే మళ్లింపు మార్గాలను అనుసరించి సహకరించాలని అధికారులు కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!