
జనరల్

అమరావతిలోని 29 రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. కనీస రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని తెలిపారు. కొన్ని గ్రామాలకు మూడు, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోందని పేర్కొన్నారు. ట్రంక్ రోడ్లు లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
అసెంబ్లీ, సచివాలయం ఉన్న వెంకటపాలెంకు కూడా సరైన కనెక్టివిటీ లేదని శ్రవణ్ కుమార్ తెలిపారు. భూసమీకరణలో భూములు ఇచ్చిన కాలనీలకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మిగిలిన 29 గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందడం లేదని ఆరోపించారు. రాజధాని గ్రామాలకు మెరుగైన రహదారులు, తాగునీరు, కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అసెంబ్లీలో కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!