
జనరల్

అమరావతి: ఈ నెల 6, 7 తేదీల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. శాసనసభ వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించనున్నారు.
మొత్తం ఏడు అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాలని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. శిక్షణలో పార్టీ, శాసనసభ కార్యకలాపాలపై కీలక సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!