

కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను ప్రస్తుతం ‘గాంధారి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల వస్తున్న హింస, షాక్ వాల్యూ ఆధారిత భారీ చిత్రాలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2015లో వచ్చిన సినిమాలను చూస్తే అది తనకు ఒక కలల కాలంలా అనిపిస్తుందని, ఇప్పుడు కెరీర్ ప్రారంభించి ఉంటే బహుశా తనకు అవకాశాలు వచ్చేవి కాదని అన్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి ఒక సినిమా చూసిన తర్వాత, అలాంటి సినిమాలు చేయడం కంటే సినిమాల నుంచి తప్పుకోవడమే మంచిదేమో అనిపించిందని వ్యాఖ్యానించారు.
తన వృత్తిని ఎంతో ప్రేమిస్తానని, అయితే నచ్చని సినిమాలను గుడ్డిగా చేయలేనని తాప్సీ స్పష్టం చేశారు. ఒక నటుడి ఫిల్మోగ్రఫీని అతను లేదా ఆమె చేసిన సినిమాలే నిర్ణయిస్తాయని, అందుకే ప్రస్తుత ట్రెండ్ కంటే తన కెరీర్‌లో నిలిచిపోయే చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా, దేవాశిష్ మఖీజా దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’ సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. జాయ్‌పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో తన కుమార్తె అదృశ్యమైన తర్వాత ఓ అంధ తల్లి చేసే పోరాటం చుట్టూ ఈ కథ సాగుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!