
సినిమాలు

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణ ఆహార భద్రతా కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నాన్ డెయిరీ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. ఆర్టిఫిషియల్ లేదా అనలాగ్ పనీర్ తయారీ, ప్యాకింగ్, నిల్వ, విక్రయాలపై నిషేధం అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలో నాన్ డెయిరీ పనీర్ ఉత్పత్తి, ప్యాకింగ్, నిల్వ, విక్రయాలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాల నాణ్యత, భద్రతపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!