

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ 2019లో ‘ఆదిత్య వర్మ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఈ నేపథ్యంలో ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మతో ధ్రువ్ విక్రమ్ తదుపరి చిత్రానికి చేతులు కలిపారు. ‘డీవీ4’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.
డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్వీ స్టూడియోస్ బ్యానర్లపై కోనేరు సత్యనారాయణ, శిరీష కురాపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ధ్రువ్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న సినిమా అధికారిక టైటిల్‌తో పాటు పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!