

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. ఈ సినిమాలో నరేశ్ వీకే, తరుణ్ భాస్కర్, ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కాకా ధూమ్ ధమాకా’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పెళ్లి బరాత్ వేడుకల్లో కనిపించే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఈ పాటను ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. సురేశ్ బొబ్బిలి మాస్ ట్యూన్‌ను సమకూర్చగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జంగి రెడ్డి పాటను ఆలపించగా, సురేశ్ బొబ్బిలి ర్యాప్ వోకల్స్ అందించారు.
‘కాకా ధూమ్ ధమాకా’ పాటలో అనుపమ పరమేశ్వరన్ చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. యారో సినిమాస్ బ్యానర్‌పై నిర్మాణ సంస్థ రెండో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు ముందే ఈ పాటతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!