

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మరోసారి ఉద్యమానికి సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 1న సీపీఎస్ విద్రోహ దినంగా పాటించాలని, సెప్టెంబర్ 6న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది.
హైదరాబాద్‌లో జేఏసీ భాగస్వామ్య సంఘాలతో నిర్వహించిన సమావేశంలో చైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టాలని, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ ఉద్యోగుల సంకల్ప సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!