

ఓటీటీ వేదికలపై కొత్త కంటెంట్ సందడి కొనసాగుతోంది. ముఖ్యంగా క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఈ జానర్‌లో మరిన్ని సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో తమిళ నటుడు భరత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ‘పంచనామా’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మేధారెడ్డి, ఉదయభాను కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
యాంకర్‌గా గుర్తింపు పొందిన ఉదయభాను కొంతకాలం విరామం తర్వాత మళ్లీ నటన, యాంకరింగ్‌లో బిజీ అవుతున్నారు. ‘పంచనామా’లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. భరత్ నటన, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యం, ఆసక్తికరమైన కథాంశంతో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ ఉదయభాను కెరీర్‌కు మరోసారి మంచి అవకాశాన్ని అందిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!