

హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం 14 బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న సీఎం, ఈ బీమా పథకం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. సింగరేణి కార్మికులకు అమలు చేసిన బీమా పథకం విజయవంతం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఉద్యోగుల సంక్షేమం, సమయానికి జీతాల చెల్లింపు, పదవీ విరమణ ప్రయోజనాల అందజేతలో ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలపడానికి ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!