
బిజినెస్

ట్రాఫిక్ ఇండెక్స్ సర్వే ప్రకారం సగటు హైదరాబాదీ ఏడాదికి 200 గంటలకు పైగా ట్రాఫిక్‌లోనే కోల్పోతున్నట్లు వెల్లడైంది. నగరంలో ఏటా వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు మెరుగుపడకపోవడంతో రద్దీ మరింత పెరుగుతోంది. ఫలితంగా ప్రజలు ప్రతిరోజూ ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడపాల్సి వస్తోంది.
ట్రాఫిక్‌తో పాటు వాతావరణ మార్పులు కూడా ప్రజల ఆరోగ్యం, నిద్రపై ప్రభావం చూపుతున్నాయని సర్వే పేర్కొంది. ఎక్కువసేపు ప్రయాణించడం, ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల కలిగే శారీరక అసౌకర్యం, ముఖ్యంగా నడుము నొప్పి వంటి సమస్యలు ఇంటికి చేరుకున్న తర్వాత కూడా సుఖనిద్రకు ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపింది. నగరంలో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, రోడ్ల అభివృద్ధి అవసరాన్ని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!