

ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ ప్లేబ్యాక్ గానానికి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా సంగీత దర్శకుడు అమాల్ మాలిక్ అరిజిత్ నిర్ణయంపై స్పందించారు. అరిజిత్ సంగీతానికే పూర్తిగా దూరమయ్యారనే ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తీసుకున్న బాధ్యతలు, గతంలో అంగీకరించిన పాటల విషయంలో మాత్రం అరిజిత్ తన పనిని కొనసాగిస్తున్నారని తెలిపారు.
కొత్తగా వచ్చే ప్లేబ్యాక్ అవకాశాలను స్వీకరించకుండా కొంత విరామం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వివరించారు. సంగీత ప్రపంచంలో తన ప్రయాణాన్ని మరో కోణంలో కొనసాగించాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. దీంతో అరిజిత్ అభిమానులకు కొంత ఊరట లభించినట్లైంది. ఆయన స్వరం పూర్తిగా వినిపించకుండా పోతుందన్న ప్రచారానికి అమాల్ మాలిక్ వ్యాఖ్యలు తెరదించాయి. ఇప్పటికే ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పాటల రికార్డింగ్‌లో అరిజిత్ పాల్గొంటున్నారని సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!